నడికుడి – శ్రీకాళహస్తి రైల్వేమార్గ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియలో నిర్వాసితులకు పరిహారం త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న చెప్పారు. మంగళవారం అమరావతి నుంచి సంబంధిత రైలుమార్గం వెళ్తున్న జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవనం నుంచి కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ పాల్గొన్నారు. కనిగిరి, పామూరు మండలాలలో భూసేకరణ ప్రక్రియలో పరిహారం చెల్లింపులో జాప్యంపై ప్రద్యుమ్న ఆరాతీశారు. వారంలోగా ఈ సమస్య పరిష్కారమయ్యేలాగా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. అనంతరం భూసేకరణ విభాగ సూపరింటెండెంట్ సంజీవరావుతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

