తాళ్లూరు మండల ఎమ్మార్పిఎస్అధ్యక్షులుగా లక్కవరంకు చెందిన గర్నెపూడి వెంకటేష్ నియమితులైనారు . ఒంగోలు నందు మంగళవారం జరిగిన ఎమ్మార్పిఎస్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన గర్నెపూడి వెంకటేష్ ఎమ్మార్పిఎస్ మండల కమిటీ అధ్యక్షునిగా నియమిస్తూ జిల్లా ఎమ్మార్పిఎస్ అధ్యక్షులు ఎం. రాజుమాదిగ్ నియామక పత్రం అందజేశారు. మండలంలోని ఎమ్మార్పిఎస్ కీలకనేతలు యోహన్, ఆదామ్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎంపిక చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఎమ్మార్పిఎస్ నేతలు గర్నెపూడి యోహన్ మాదిగ్,,అనపర్తి ఆదామ్ మాదిగ్, బాలకోటయ్య, నరసింహరావు, భాస్కర్, వెంకటేశ్వర్లు, మోషె తదితరులు పాల్గొన్నారు.
