రానున్న 48 గంటలలో భారీ వర్ష సూచన నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని, ప్రత్యేక బలగాలతో బందోబస్తు మరియు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్
అన్నారు. చెరువులు, కుంటలు నిండి,లోతట్టు ప్రాంతాలు, గండి పడే అవకాశాలపై ముందస్తుగా క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలని, ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు సహాయక చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సీఐలు, ఎస్సైలు సిబ్బందితో 18 టీములు ఏర్పాటు చేసినట్లు, ప్రతి టీములో 20 మంది సిబ్బంది ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ బలగాలు సహాయక చర్యల నిమిత్తం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొనే బృందాలకు అవసరమైన లైటింగ్ సామాగ్రి, లైఫ్ జాకెట్లు, సహాయచర్యలు నిమిత్తం తాళ్లు, బ్యాటన్లు, జేసీబీ మొదలగు సామగ్రి సంసిద్ధంగా ఉంచామని వివరించారు.
