శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం వైసీపీ నేత బాల్ రెడ్డికి చెందిన మద్యం షాపుపై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు మద్యం సీసాలు కంప్యూటర్ సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు బాల్ రెడ్డి ఇటీవల టెండర్ ప్రక్రియలో లైసెన్స్ ను దక్కించుకున్నారు నేడు నూతన మద్యం షాప్ ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని మద్యం సరుకును షాప్ లో నింపాడు ఈ క్రమంలో దాడి జరగ్గా దాదాపు 10 లక్షల వరకు నష్టం జరిగిందని బాధితుడు తెలిపారు.


