సముద్రమే లేని తెలంగాణలో ఇండియన్ నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయడం వెనుక ఓ కారణం ఉంది. భారత్‌కు తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రంలో నిత్యం నేవీ జలాంతర్గాములు ప్రయాణిస్తూ ఉంటాయి. వాటి కమ్యూనికేషన్‌కు 2 సముద్రాల మధ్య దాదాపు సమాన దూరంలో ఉన్న వికారాబాద్ అడవి సరైనదిగా నేవీ భావించినట్లు సమాచారం. భారత్‌లో ఇది రెండో రాడార్ స్టేషన్. మొదటిది తమిళనాడులోని తిరునల్వేలి వద్ద ఏర్పాటు చేశారు.
ఏంటీ ‘రాడార్ స్టేషన్’?
వికారాబాద్ అడవుల్లో నిన్న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ శంకుస్థాపన చేసిన రాడార్ స్టేషన్ పూర్తి పేరు ‘వెరీ లో ఫ్రీక్వెన్సీ(VLF) రాడార్ కమ్యూనికేషన్ స్టేషన్’. ఇండియన్ నేవీకి సంబంధించిన ఓడలు, జలాంతర్గాముల్లోని సిబ్బందితో మాట్లాడటంతో పాటు ఇతర రేడియో కమ్యూనికేషన్‌కు దీన్ని ఉపయోగిస్తారు. ఇది 3 KHz నుంచి 30 KHz రేంజ్‌లో తరంగాలను ప్రసారం చేస్తుంది. ఈ సిగ్నల్ నీటి లోపల కూడా 40మీ. వరకూ వెళ్లగలదు.