రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పాలన సాగుతొందని టిడిపి దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కోన్నారు. మండలంలోని మాధవరం, దారం వారి పాలెం, తురక పాలెం గ్రామాలలో బుధవారం పల్లెపండుగ వారోత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న టిడిపి దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టి పాటి లక్ష్మి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయితీ వ్యవస్థను ప్రక్షాళనం చేసారని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం పంచాయితీలకు రూ. 4,500 కోట్లు మంజూరు చేసారని అన్నారు. అందులో 3వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు .500 కిలో మీటర్ల తారు రోడ్లు, గోశాలను, ఇంకుడు గుంటలకు తదితర కార్యక్రమాలు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలో 13,326 పంచాయితీలలో గ్రామ సభలు జరిగి పనులు గుర్తించిచారని అందులో 30వేల పనులకు ప్రారంభం జరుగుతున్నట్లు తెలిపారు. పల్లెలు పట్టుగొమ్మలని పల్లెలు అభివృద్ధి చెందితేను పట్టణాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడార్ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్లెలు, రైతులు అంటే ప్రత్యేక అభిమానంతోను పల్లెల అభివృద్ధికి శ్రీకారం చుట్టారని అన్నారు. వారి సారధ్యంలో మంచి ప్రజా సంక్షేమ పాలన సాగుతుందని అన్నారు. తాళ్లూరు మండలంలో రూ.3కోట్ల పనులు మంజూరు అయ్యాయని, అందులో రూ. 70 లక్షల పనులు మూడు గ్రామాలలో శంకుస్థాపన చేస్తున్నట్లు చెప్పారు. సంక్రాంతి నాటికి పనులు పూర్తి చేసి ఘనంగా ప్రారంభించాలని కోరారు.
ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామంలో ఎంత కృషిచేసినా రోడ్డు వేయ్యలేక పోయామని …నేడు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మౌళిక వసతుల అభివృద్ధికి సహకరిస్తున్నందుకు ధన్యవాదాలని చెప్పారు. దర్శి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సహకారంతో గ్రామాలలో అభివృద్ధి చేసుకునేందుకు ఎంతో సహకరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నట్లు చెప్పారు. అనంతరం ఆయా గ్రామాలలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. కడియాల లలిత్ సాగర్, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు శంకుస్థాపనలో ముఖ్య అతిథిలుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో కార్యకర్తలు అభిమానులు వారికి ఘన స్వాగతం పలికారు . తురకపాలెంలో టిడిపి అభిమాని కుమ్మిత ఓబుల్ రెడ్డి అన్న క్యాంటీన్ నిర్వహణ నిమిత్తం 50 వేల రూపాయలు ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కి అందించారు .ఆయా కార్యక్రమాలలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, మండల ప్రత్యేక అధికారి ఉషారాణి, మండల టిడిపి అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబులు రెడ్డి, నాయకులు మానం రమేష్ బాబు, శాగం కొండా రెడ్డి, మేడగం వెంకటేశ్వర రెడ్డి, సర్పచిలు చంద్రగిరి గురువా రెడ్డి, మంచాల వెంకేటేశ్వర రెడ్డి, తహసీల్దార్ నాగలక్ష్మి, ఎంపీడీఓ సుందర రామయ్య తదితరులు పాల్గొన్నారు.
దోర్నాపు వాగు బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తా – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
విఠలాపురం నుండి తాళ్లురు టౌన్ కి మధ్యలో లో దోర్నాపు వాగు ఉదృతం గా ప్రవహిస్తూ ఉడటం తో స్థానిక నాయకులతో కలిసి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పరిశీలించారు . త్వరలో సంబంధిత ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ శాఖ లతో మాట్లాడి ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి అంచనాలను వెంటనే తయారు చేయించి నిర్మాణ కృషి చేస్తానని హామీ ఇచ్చారు . అకాల వర్షాలు వరదల సమయాల్లో లో లెవెల్ బ్రిడ్జిల వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకునే దీనిపై ప్రభుత్వం పెద్దలతో మాట్లాడి వెంటనే పనులు జరిగేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నాయకులు ఐ . శ్రీనివాస రెడ్డి తది తరులు పాల్గొన్నారు .






