భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు నిల్వకుండా పూడికతీత పనులను యుద్దప్రాతిపదికన చేపట్టడంతో పాటు ప్రజలకు తాగునీటికి, విద్యుత్ కు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, మున్సిపల్ అధికారులను ఆదేశించారు
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, నగర మేయర్ గంగాడ సుజాత తో కలసి బుధవారం ఉదయం ఒంగోలు నగరంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. తొలుత జిల్లా కలెక్టర్ …మదర్ థెరిస్సా కాలనీనీ సందర్శించి, నల్లవాగును, అక్కడ పరిస్థితులను పరిశీలించి ఆ ప్రాంత వాసులతో మాట్లాడటం జరిగింది. ఈ కాలనీలో వర్షం నీరు నిల్వకుండ అవసరమైన పూడికతీత పనులు చేపట్టాలని అలాగే విద్యుత్ కు తాగునీటికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ బి.ఎస్ ఆర్ కాలనీని పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారీ వర్షాల నేపధ్యంలో జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల పై ప్రత్యేక దృష్టి సారించి వర్షం నీరు నిల్వఉండకుండా చర్యలు తీసుకోవడం జరుగు చున్నదన్నారు. ఒంగోలు నగరంలోని లోతట్టు ప్రాంతాలైన కేశవరాజుగుంట, బలరాంకాలనీ, నేతాజికాలనీ, నెహ్రూ నగర్, మదర్ థెరిస్సా కాలనీ తదితర కాలనీలపై ప్రత్యేక దృష్టి సారించి ఆయా ప్రాంతాల్లో వర్షం నీరు నిల్వకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం జరుగు చున్నదన్నారు. అవసరమైతే ఈ ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లా లో మొత్తం 35 పునరావాస కేంద్రాలను గుర్తించడం జరిగిందని, ప్రస్తుతం ఒంగోలు, టంగుటూరు, కొత్తపట్నం, సింగరాయకొండ మండలాలలో ఐదు పునరావాస కేంద్రాలను ఓపెన్ చేసి సుమారు 200 మంది ప్రజలకు షెల్టర్ ఇవ్వడం జరుగుచున్నదన్నారు. జిల్లా ను రెడ్ జొన్ గా ప్రకటించినందున జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అవసరమైన ముందస్తు చర్యలు తీసు కుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఓవర్ ఫ్లో అవుతున్న సప్టాల వద్ద రెవెన్యూ, పోలీసు సిబ్బంది ని కూడా నియమించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రజలు కూడా అటువసరమైతే తప్ప బయటకు రావద్దని జిల్లా కలెక్టర్ సూచించారు.
అనంతరం కొప్పోలు – కరవది రోడ్డు లోని డంపింగ్ యార్డు వద్ద గల మునిగిపోయిన ముడికొండవాగు లో లెవెల్ సప్టాను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వరద ఉదృతి తగ్గేవరకు ఎవరినీ వెళ్ళనీవద్దని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ వెంట, నగరపాలక సంస్థ కమిషనర్ వేంకటేశ్వర రావు, ఆర్డీవో లక్ష్మి ప్రసన్న, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






