పొగిన పెళ్లూరు చెరువు – కొట్టుకు పోయిన చేపలు – రూ. మూడు లక్షల రూపాయల నష్టం – జిల్లా మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి

భారీ వర్షాల వలన ఒంగోలు మత్స్య సహకార సంఘం పరిధిలోని
పెళ్లూరు చెరువులో నీరు పొంగిందని, ఈ క్రమంలో నీటితోపాటు చేపలు కూడా వెళ్లిపోవడం వలన సుమారు మూడు లక్షల రూపాయల నష్టం వచ్చినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి ఆవుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ చెరువు ఇన్ లెట్ కాలువ ద్వారా బయటకు పోతున్న మత్స్య సంపదను కాపాడుకునేందుకు కాలువలో రైతులు ఏర్పాటుచేసిన ఇనుప వలలు కూడా దెబ్బతిన్నట్లు ఆయన చెప్పారు. పరిస్థితిని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా దృష్టికి తీసుకు వెళ్ళగా, ఆమె ఈ ఇన్ లెట్ కాలువను సందర్శించి దెబ్బతిన్న మెష్ , వలలను పరిశీలించారు. రైతులకు మరింత నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట మత్స్యశాఖ డెవలప్మెంట్ ఆఫీసర్ రవి, ఇతర అధికారులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *