అక్టోబర్ 17వ తేదీన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించినందున జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, అన్ని యాజమాన్యాలలోని పాఠశాలలు, కాలేజీలకు గురువారం కూడా సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు కూడా ఇళ్లలో నుంచి బయటకు రావద్దని ఆమె సూచించారు. భారీ వర్షాల వలన ఎలాంటి పరిస్థితి తలెత్తినా సమర్థంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధమై ఉన్నట్లు చెప్పారు.
