మోకాటి లోతు గుంతలు పడి విఠలాపురం – లింగాల పాడు రోడ్ గురికావటంతో ప్రజలు, వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత పదేళ్ల క్రితం ఈ రోడ్ మన్నేపల్లి నుండి విఠలాపురం వరకు తారు రోడ్ కావటంతో అధిక సంఖ్యలో లారీలు అధిక లోడ్ తో తిరగటంతో అనతి కాలంలోనే పూర్తిగా దెబ్బతిన్నది. ప్రస్తుతం రోడ్డు లో పెద్ద పెద్ద గోతులు ఏర్పడటంతో తూర్పుగంగవరం నుండి తురకపాలెం, రవణాల వారి పాలెం , విఠలాపురం చంద్రగిరి ,ముండ్లమూరు వెళ్లాలంటే ఈ దారిలో వాహనదారులు అధికంగా ఉపయోగిస్తుంటారు. గోతుల వలన ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిథులు స్పందించి కనీసం గోతులను పూడ్చి కొంత మేర రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు.




