కలాం అవార్డు అందుకున్న రఘు ప్రదీప్

డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ ప్రతిభా పురస్కారాన్ని గుంటూరు లో జరిగిన కార్యక్రమంలో ఒంగోలు మండలం కరవది వివేకానంద విద్యావిహర్ కరస్పాండెంట్ ఎన్ వి ఎస్ రఘు ప్రదీప్ అందుకున్నారు. ఆదివారం గుంటూరు ఏసీ కళాశాల ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు చేతుల మీదుగా రఘు ప్రదీప్ అవార్డు అందుకున్నారు. గత 30 సంవత్సరాలుగా సైన్సు ఉపాధ్యాయుడిగా చేస్తున్న సేవలకు గుర్తింపుగా ప్రతి ఏడాది జాతీయ సైన్స్ దినోత్సవాన్ని గ్రామీణ ప్రాంతంలో విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు గాను ఈ అవార్డు అందుకున్నారు. కార్యక్రమంలో, మలినేని గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ చైర్మన్ మలినేని పెరుమాళ్, గుంటూరు ఏసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే మోజెస్, గుంటూరు లా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అమృత వర్షిని, నాగార్జున విశ్వవిద్యాలయబోర్డు సభ్యులు డాక్టర్ వి కన్నా మాస్టర్, అపుస్మ రాష్ట్ర జాయింట్ ట్రెజరర్ కాటూరి వెంకటేశ్వరరావు, అప్సా స్టేట్ కొ చెర్మన్ మేకల రవీంద్రబాబు, ఎస్ పి ఎన్ టి ఓ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నాగయ్య తదితరులు పాల్గొని అవార్డు అందజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *