జిల్లాలో సరా సరి 17.9 మి.మీల వర్షపాతం నమోదు – ప్రతి రోజు వర్షంతో ప్రజలు,రైతులు ఇబ్బందులు

జిల్లాలలోని 38 మండలాలలోని 37 మండలాలలో ఆదివారం 680.5 మి.మీలు సరాసరి 17.9 మి.మీల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. అందులో అత్యధికంగా ఎస్.కొండలో 65.2 మి.మీలు అత్యల్పంగా దోర్నాలలో 1.8 మి.మీగా నమోదు అయినది. అదే విధంగా చీమకుర్తిలో 59.0 మి.మీలు, ఒంగోలు 50.4, కె కెమిట్ల 48.0,కొత్తపట్నం 44.0, పొదిలి 42.4,
ఎస్ ఎన్ పాడు 30.6, జరుగుమల్లి 29.2. పామూరు, పొన్నలూరులలో 24.2, కురిచేడులో 20.0, కనిగిరి 19.6, టంగుటూరు 19.5,పిసి పల్లి 17.2, సిఎస్ పురం 16.2, ఎన్. జి పాడు 15.6, దొనకొండ 14.0, దర్శి 12.4. మద్దిపాడు 11.0, వెలిగండ్ల 10.8, హెచ్ఎం పాడు, మర్రి పూడిలలో 9.6 మి.మీల చొప్పున, అర్థవీడులో 9.2, గిద్దలూరు, తాళ్లూరులలో 8.6 మి.మీల చొప్పున, కొండెపి, మార్కాపురం లలో 6.8 మి.మీల చొప్పున, బేస్త వారి పేటలో 6.2. కొమరోలు 5.8, తర్లు పాడులో 5.6, త్రిపురాంతకం 5.2, ముండ్లమూరులో 4.0, యర్రగొండ పాలెం 3.6, కంభం 3.2ల చొప్పున వర్షపాతం నమోదు అయినది. ప్రతి రోజు పడుతున్న వర్షానికి రోడ్లు బురదమయం అవటంతో పాటు పొలాలలో కూడ పనులు సాగక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంటలలో నీటిని బయటకు పెట్టేందుకు రైతులు నిత్యం కష్టపడుతున్నారు. పది రోజుల తెరప ఇచ్చిన తర్వాత మరలా వర్షం కురిస్తే కొంత ఉపయోగం ఉండే అవకాశం ఉన్నది. అతి వర్షాలతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *