ఏళ్ల తరబడి తిరుగుతున్నా తన భూమిని ఆన్ లైన్ చేయటం లేదని తాళ్లూరుకు చెందిన చందోలు రామారావు సోమవారం జరిగిన స్పందనలో తహసీల్దార్ నాగలక్ష్మికి విన్నవించారు. పరిశీలించి న్యాయం చెయ్యాలని కోరారు. స్పందన కార్యక్రమంలో ఎంపీడీఓ సుందర రామయ్య, డిప్యూటీ తహసీల్దార్ ఇమ్మానియేల్ రాజు, ఎంఈఓ జి సుబ్బయ్య, వ్యవసాయాధికారి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
