అల్పపీడన ప్రభావంతో గత పది రోజుల నుంచి కురిసిన వర్షాలకు జిల్లాలో భారీ గా పంట నష్టం వాటిల్లింది. ప్రస్తుతం వర్షాలు తగ్గి తెరప ఇస్తుండడంతో నష్టాలు రోజురోజుకు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లా వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా ప్రకారం సోమవారం సాయంత్రం వరకు జిల్లాలోని 36 మండలాల్లోని 205 గ్రామాల్లో 8,409.27 హెక్టార్లలో పంటలకు నష్టం జరిగినట్లు గుర్తించారు. 7,672 మంది రైతులకు చెందిన వివిధ రకాల పంటలు వర్షాలకు దెబ్బతిన్నాయి. సజ్జ 1,383,47, మినుము 1379, జొన్న 3, అలసంద 1,683,ప్రత్తి2,627.80,
వరి 120, కొర్ర 18,పొగాకు 695 హెక్టార్లు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు జేడీఏ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లావ్యాప్తంగా వర్షాలకు పలురకాల పంటలు దెబ్బతినడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వర్షాల కారణంగా చేతికి వచ్చే పంటలు కోల్పోవడంతో భారీగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.
జిల్లాలో పెరుగుతున్న పంట నష్టాలు -8,409 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు
22
Oct