ట్రైకో డెర్మాతో తెగుళ్ల నివారణ – వ్యవసాయాధికారి ప్రసాద రావు

టైకో డెర్మా విరిడితో వేరు కుళ్లు, మాగుడు,ఎండు తెగుళ్లు సమర్థవంతంగా అరికట్టవచ్చని తాళ్లూరు మండల వ్యవసాయాధికారి బి ప్రసాద రావు అన్నారు. తాళ్లూరు- 1, 2 రైతు సేవా కేంద్రాల పరధిలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. అధిక వర్షాల సమయంలో ప్రతి రైతు పలు పంటలకు వచ్చే తెగుళ్ల నివారణకు ఉత్తమ సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. టైకో డెర్మా విరిడి వ్యవసాయ కార్యాలయంలో అందుబాటులో ఉన్నదని చెప్పారు. మొక్కజొన్న సాగు చేయు రైతులకు రాయితీపై టార్బాలిన్ పట్టలు ప్రభుత్వం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విఏఏ నాగరాజు, ఎలీషా, అమృత వర్షిణి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *