అధిక వర్షాల వలన పంటల పొలాలలో నీరు నిల్వ ఉంటే తక్షణమే బయటకు పంపి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ప్రకాశం జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మెనేజర్ వి సుభాషిణి కోరారు. వరి, ప్రత్తి, మిరప, కంది పొలాలలో నీటికి బయటకు పంపి తగిన చర్యలు తీసుకోవాలని, సస్యరక్షణకు ఉపయోగించాల్సిన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను సూచించారు. తగిన సహకారం కావాలంటే తమ పరధిలోని ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని సంప్రదించాలని కోరారు.
