గ్రామాలలో సీజనల్ వ్యాధుల ప్రజల కుండా అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ సుందర రామయ్య కోరారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం మండలంలోని గ్రామకార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, ఎం.ఎల్.ఎహ్.పి, వైద్యులు, ఎంఈఓ, అర్ డబ్యు ఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ సుందర రామయ్య మాట్లాడుతూ ఆరోగ్య, పంచాయితీ శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పారిశుధ్యం, ప్రజల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించి ఎవైనా ఇబ్బందులు ఉంటే తక్షణమే తెలియజెయ్యాలని కోరారు. వైద్యులు రాజేష్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, ఎంఈఓ సుబ్బయ్య, ఆర్ఎబ్యుఎస్ ఎఈ వాలి తదితరులు పాల్గొన్నారు.

