తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మప్రచారపరిషత్ మరియు స్థానిక వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులచే డా. ఆకెళ్ళ విభీషణశర్మ చే రచించ బడిన *మానవులందరికి – భగవద్గీత *అనే పుస్తకావిష్కరణ మంగళవారం టిటిడి కల్యాణమండపం నందు జరిగినది. భగవద్గీత లోని 18 అధ్యాయాలలోని విషయాలు క్రోడీకరించి సామాన్య మానవులకు ముఖ్యంగా విద్యార్థులకు భగవద్గీత సారమును అందించడమే ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఉభయ రాష్ట్రాల విద్యార్థులకు ఉచితంగా ఈ పుస్తకాలను టిటిడి అందిస్తున్నది. మన ప్రకాశం జిల్లా కు 20000 పుస్తకాలు పంపించడం జరిగింది. ఈ పుస్తకాలు కావలసిన పాఠశాల యాజమాన్యం మరియు ప్రధానోపాధ్యాయులు వారు కావలసిన పుస్తకాలు టిటిడి కల్యాణమండపం, సంతపేట, ఒంగోలు వద్ద నుండి కార్యాలయ సమయం లో స్కూల్ ముద్ర, సంతకం చేసి ఉచితంగా పొందవచ్చు. ఈ కార్యక్రమంలో ప్రాధనోపాధ్యాయులు సైకం వెంకటరెడ్డి, ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానం మాజీ సభ్యులు పాలపర్తి లక్ష్మీ నారాయణ, శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు జంధ్యం రమణ గుప్తా, పౌర్ణమి గిరి గిరి ప్రదక్షిణ నిర్వాహకులు బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి, హిందూ చైతన్య వేదిక జిల్లా సహా కన్వీనర్ దగ్గుమాటి వెంకారెడ్డి, శ్రీరామాలయం, అంబేద్కర్ నగర్ కరవది చైర్మన్ గొలిమి వేంకటేశ్వర్లు, శ్రీవారి సేవకులు మద్దు అరవిందలక్ష్మి, చీమకుర్తి శివప్రసాద్, పత్రికా ప్రతినిధి ఉబ్బా అశోక్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్నారు. టిటిడి ప్రోగ్రాం అసిస్టెంట్ రావినూతల రామకృష్ణ మాట్లాడుతూ చిన్ననాటి నుండే విద్యార్థుల్లో జీవితం పట్ల అవగాహన కలిగిస్తూ మేధో వికాసాన్ని పెంపొందించి పరిపూర్ణమైన మానవునిగా ఎదగడానికి ఉపయుక్తపడే అపూర్వ గ్రంథం భగవద్గీత. అట్టి భగవద్గీత 18 అధ్యాయాలలోని శ్లోకాల సారాన్ని భావితరాలకు అందించడమేయని తెలిపారు. మరిన్ని వివరములకు 7386662048 నెంబర్ లో సంప్రదించవలసినదిగా కోరారు.
