ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామాలలో విష జ్వరాలు, అతిసారా వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తూర్పుగంగవరం పీహెచ్సీ వైద్యులు డాక్టర్ కె .మౌనిక డాక్టర్ శ్రీకాంత్ రెడ్డిలు సూచించారు. తూర్పుగంగవరం పీహెచ్.సి లో గురువారం ఆరోగ్య సిబ్బందికి విషజ్వరాలపై, అతి సారాపై అవగాహన కల్పించారు. జ్వరాలు ఉన్న సమయంలో ముందుగా విలేజ్ హెల్త్ క్లినిక్ ను ఆశ్రయించే విధంగా ప్రజలను అప్రమత్తం చెయ్యాలని, తర్వాత ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను వచ్చి తగిన వైద్యం పొందే విధంగా చూడాలని కోరారు. అవసరమైన ఓఆర్ఎస్, ఇతర మందులు అందుబాటులో ఉంచుకుని ప్రజలకు అందించాలని చెప్పారు. హెచ్ఓ కె. చంద్రశేఖర్ బాబు, హెచ్ఎస్ బి సుశీల తదితరులు పాల్గొన్నారు.
