వసతి గృహాలను తనిఖీ చేసిన ఎంపీడీఓ సుందర రావు

తాళ్లూరు మండలంలోని పలు సంక్షేమ శాఖల వసతి గృహాలను ఎంపీడీఓ సుందర రామయ్య గురువారం తనిఖీ నిర్వహించారు. కస్తూరిభా, బీసీ, ఎస్సీ వసతి గృహాలను తనిఖీ నిర్వహించి వసతి లోపాలను గుర్తించారు. ఆయా వసతి గృహాలలో సమస్యలను గుర్తించి నివారణకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. కస్తూరిభా వసతి గృహం వెలుపల జంగిల్ క్లియరెన్స్ చేయించాలని ప్రిన్సిపాల్ సుజిత ఎంపీడీఓకు విన్నవించారు. తగిన చర్యలు తీసుకుని విద్యార్థులకు సౌకర్యాలు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ఐడమ కంటి శ్రీనివాస్ రెడ్డి, మాగంటి శ్రీను పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఉపయోగంలోనికి చెత్త సంపద కేంద్రాలు..

చెత్త సంపద కేంద్రాలను పూర్తిస్థాయిలో బాగు చేసి వినియోగంలోనికి తీసుకురాన్నుట్లు ఎంపీడీఓ సుందర రామయ్య తెలిపారు. శివ రామ పురం చెత్త సంపద కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. చెత్త సంపద కేంద్రం వద్ద ఉన్న జంగిల్ క్లియర్ చేయించారు. త్వరలో మండలంలోని అన్ని కేంద్రాలను వినియోగంలోనికి తీసుకువస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *