సృజనాత్మకత, సానుకూలతలు ఉన్నవారు తమ జీవితంలో విజయాలు సాధించి అత్యున్నత స్థానం చేరతారని వాసవి క్లబ్ అంతర్జాతీయ సేవా సంస్థ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ తెలిపారు తమ అధికార “సద్భావన సందర్శన” పర్యటనలో భాగంగా ఒంగోలు విచ్చేసిన రవిచంద్రన్ స్థానిక క్లబ్స్ నిర్వహించిన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నగరంలోని 5 వాసవి క్లబ్ శాఖలు వాసవి క్లబ్ ఒంగోలు, వాసవి క్లబ్ ఒంగోలు విజన్, వాసవి క్లబ్ మహిళా విజన్, వాసవి క్లబ్ కే సి జి ఎఫ్ యూత్ ఒంగోలు మరియు వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ తమ అంతర్జాతీయ అధ్యక్షుడు పర్యటన సందర్భంగా పలు శాశ్వత ప్రాజెక్టులను మరియు అనాధ వృద్ధాశ్రమాలలో సేవలు నిర్వహించారు. వాసవి క్లబ్ ఒంగోలు అధ్యక్షులు నల్లమల్లి వదిలి నారాయణ ఆధ్వర్యంలో చీదెళ్ల వెంకట ప్రసాద్ దాతృత్వంతో శాశ్వత ప్రాజెక్టు క్రింద ఇనుప గేటుని స్థానిక సంతపేట శిరిడిసాయి మందిరమునకు అమర్చారు. వాసవి క్లబ్ మహిళా విజన్ తమ కార్యక్రమంలో భాగంగా శాశ్వత ప్రాజెక్టు కింద పొత్తూరి శ్రీదేవి దంపతుల దాతృత్వములో 1000 లీటర్ల వాటర్ ట్యాంక్ ను బండ్లమిట్ట ప్రభుత్వబాలికల ఉన్నత పాఠశాలకు బహుకరించారు. స్థానిక బొమ్మరిల్లు ఆశ్రమమునకు ఫాన్లు, ట్యూబ్ లైట్లు, అనాధ బాలలకు విద్యాసామగ్రి, బియ్యం, స్కూల్ యూనిఫామ్స్ పంపిణి చేశారు. ఉమామనో వికాస కేంద్రములో నిత్యవసరములు మరియు సీతారామపురంలోని సమతావేదిక వృద్ధాశ్రమంలోని మాతృమూర్తులకు రవిచంద్రన్ చేతులమీదుగా చీరలను పంపిణి చేశారు.
ఈ సందర్భముగా రవిచంద్రన్ మాట్లాడుచూ… ఒకే కమ్యూనిటి ఆర్యవైశ్యులు మాత్రమే సభ్యులుగా గల వాసవిక్లబ్స్ అంతర్జాతీయ సేవా సంస్ధ ప్రపంచ వ్యాప్తముగా తొమ్మిది దేశాలలో వేయికి పైగా క్లబ్స్, లక్షమంది సభ్యులతో సామాజిక సేవలు సమాజంలోని అన్నివర్గాలవారికి, అన్నివర్ణాలవారికి చేస్తున్నది ఒకేఒక వాసవిక్లబ్స్ గా తెలిపారు. తమ పర్యటనలో భాగంగా బుధవారం, గురువారం రెండురోజుల్లో వాసవిజిల్లా 205 లో సూళ్ళూరుపేట, బుచ్చిరెడ్డి పాలెం, కావలి, కృష్ణపట్నం పోర్టు, ఒంగోలు, చీరాల లోని వాసవిక్లబ్స్ నిర్వహిస్తున్న సేవలను పరిశీలించడం జరిగిందని తెలిపారు. సమాజానికి వాసవిక్లబ్స్ సభ్యులు చేస్తున్న నిరంతర సేవలు స్ఫూర్తివంతమని తెలిపారు.
వాసవిక్లబ్ సభ్యులు గజమాలతో తమ అంతర్జాతీయ అధ్యక్షునికి గజమాలతో స్వాగతం పలికారు. శ్రీ వాసవికన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాసవిక్లబ్స్ అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ వెంట వాసవిక్లబ్స్ అంతర్జాతీయ కోశాధికారి శిద్దా వేంకట సూర్యప్రకాశరావు, 205 గవర్నర్ పేర్ల వేంకట సత్యనారాయణ, క్లబ్ అధికారులు, క్లబ్ అధ్యక్షులు నల్లమల్లి బదరి నారాయణ, కూనల శ్రీనివాసరావు, చలువాది కవితారాణి, సిహెచ్ పవన్ కుమార్, నగేష్, యం. దుర్గా భవాని, కె శ్రీనివాసరావు, నందకుమార్, భూమా శ్రీనివాసరావు, కె పవన్ కుమార్, సత్యనారాయణ, సునిల్ కుమార్, సౌందర్య, సంపత్ కుమార్, శ్రీనివాసరావు, మరియు క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




