రైతులకు అవసరమైన ఎరువులు కొరత లేకుండా సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

జిల్లాలో వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న నేపధ్యంలో రైతులకు అవసరమైన ఎరువులు కొరత లేకుండా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

గురువారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, వ్యవసాయ, ఉద్యాన శాఖ మార్క్ ఫెడ్, ఎపిఎంఐపి శాఖల అధికారులతో సమావేశమై జిల్లాలో వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న నేపధ్యంలో రైతులకు అవసరమైన ఎరువులు కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఎ ప్రాంతంలో ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేసినారు, అందుకు అవసరమైన ఎరువుల డిమాండ్ ఎంత, మార్క్ ఫెడ్ నుండి జిల్లాకు ఎంత సరఫరా అవుచున్నది ప్రతి రోజు నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా లో ప్రస్తుతం ఎరువుల కొరత లేదని రైతులకు అవసరమైన ఎరువులు రైతు సేవా కేంద్రాల్లో రైతులకు అందుబాటులో వున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఎరువుల డిమాండ్, సప్లయ్ ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువులను రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్, వ్యవసాయ మరియు మార్క్ ఫెడ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉద్యానవన పంటలు ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులు ఆదేశించారు. అలాగే ఉద్యాన పంటలకు సంబంధించి కూడా సంబంధిత రైతులకు ఎరువుల కొరత లేకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఉద్యానవన శాఖ అధికారిని ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాస రావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి గోపీచంద్, ఎపిఎంఐపి పిడి రమణ, మార్క్ ఫెడ్ డి ఎం హరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *