ఆంధ్ర రాష్ట్ర పీసీసీ అన్ఆర్గనైజెడ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ కాంగ్రెస్ ఛైర్మన్ గా నియమించబడిన తరువాత మొట్టమొదటి సారిగా విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్లో ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ మరియు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి పాలక్ వర్మా ని మర్యాదపూర్వకంగా కైపు వెంకట కృష్ణా రెడ్డి కలిసారు . ఈ సందర్భంగా తనకు ఇంత కీలక బాధ్యతను అప్పజెప్పినందుకు పీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి కి, పాలక్ వర్మా కి, ఏఐసీసీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తన మీద పెట్టిన ఈ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను అని, కాంగ్రెస్ పార్టీ నినాదాన్ని, అట్టడుగు వర్గాల వరకు చెరవేసి, పార్టీకీ రాష్ట్రంలో పూర్వ విభవం తెచ్చేవిధంగా షర్మిలా రెడ్డి గారి నాయకత్వంలో ఒక సైనికుడిలా పని చేస్తాను అని కృష్ణా రెడ్డి తెలిపారు.
