జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమం శుక్రవారం నుండి ప్రారంభమైన సందర్భంగా పశుసంపద లెక్కింపు కార్యక్రమంలో భాగంగా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డా. బేబి రాణి తన సిబ్బందితో కలసి జిల్లా కలెక్టర్ గారి నివాసంను సందర్శించి వివరాలు సేకరించడం జరిగింది. ఈ సందర్భంగా వివరాలు సేకరించినట్లుగా పశు సంవర్ధక శాఖ సిబ్బంది గోడపై స్టికర్ ను అంటించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ. తమీమ్ అన్సారియా మాట్లాడుతూ, ఈ కార్యక్రమం వచ్చే ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు కొనసాగనున్నందున, నిర్ణీత గడువులోపు జిల్లాలోని ప్రతి ఇంటిని సందర్శించి, పశుగణన సమగ్ర సమాచారాన్ని సేకరించాలన్నారు. నోడల్ అధికారి సహాయ సంచాలకులు డా.పి.చంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు .




