నొప్పులకు ఆధునిక పద్దతులతో చికిత్సలు :డా. నాగలక్ష్మి – దీర్ఘ‌కాలిక‌, తీవ్ర‌మైన నొప్పుల‌పై కిమ్స్ ఆస్ప‌త్రిలో వ‌ర్క్‌షాప్‌

మారుతున్న చికిత్స విధానాలతో వైద్యరంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. దీర్ఘ‌కాలిక‌, తీవ్ర‌మైన నొప్పికి చికిత్స చేయ‌డంలో వ‌స్తున్న ఆధునిక ప‌ద్ధ‌తుల‌పై మత్తు మందు వైద్య నిపుణులు, పెయిన్ ఫిజిషియ‌న్ల కోసం కిమ్స్ ఆస్ప‌త్రిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెయిన్ మెడిసిన్ అండ్ ఎన‌స్థీషియాల‌జీ ఆధ్వ‌ర్యంలో మూడురోజుల పాటు వ‌ర్క్‌షాప్ నిర్వ‌హించారు. నొప్పి నివార‌ణ‌కు అందుబాటులో ఉన్న చికిత్స విధానాలపై వైద్య నిపుణుల‌ను అప్‌డేట్ చేయ‌డం, రోగులవారీగా ఎవ‌రికి అవ‌స‌ర‌మైన నొప్పి నివార‌ణ పద్దతులు వారికే అంద‌జేసేలా శిక్ష‌ణ ఇవ్వ‌డం ఈ వ‌ర్క్‌షాప్ ల‌క్ష్యం.
ఈ సంద‌ర్భంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎన‌స్థీషియాల‌జీ హెచ్ఓడీ డాక్ట‌ర్ న‌రేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “పెరిఆప‌రేటివ్ సెట‌ప్‌, దీర్ఘ‌కాలిక నొప్పినివార‌ణ క్లినిక్‌ల‌లో..నొప్పిన స‌మ‌ర్థంగా తొల‌గించ‌డానికి అల్ట్రాసౌండ్‌, ఫ్లూరోస్కొపీల విస్తృత వాడ‌కంపై మేం ప్ర‌ధానంగా దృష్టిపెట్టాం. అవ‌గాహ‌న పెంపొందించ‌డానికి, విజ్ఞానం చేరవేయాడానికి మేం ఒక ప్లాట్‌ఫాం సృష్టించ‌డానికి ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకున్నాం. అనుభ‌వ‌జ్ఞులైన మా ఫ్యాక‌ల్టీ నుంచి రియ‌ల్-టైం ఇమేజింగ్ ప‌ద్ధ‌తుల గురించి నేర్చుకోడానికి హాజ‌రైన‌వారికి ఒక అవ‌కాశం ల‌భించింది” అని చెప్పారు.
ఈ కార్యక్రమాన్ని కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సిఎండి డాక్టర్. బి.భాస్కర్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రాష్ట్రంలోను, రాష్ట్రం వెలుప‌ల ఉన్న అనుభ‌వ‌జ్ఞులైన ఫ్యాక‌ల్టీతో ఈ వ‌ర్క్‌షాప్‌ను ఎన‌స్థీషియాల‌జీ విభాగాధిప‌తి డాక్ట‌ర్ న‌రేష్ కుమార్ రెడ్డి, నేతృత్వంలో క‌న్సల్టెంట్ పెయిన్ ఫిజిషియ‌న్ డాక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి ప‌ట్నాల మరియు ఉస్మానియా మెడికల్ కాలేజ్ అనస్థీషియాలజీ విభాగం నుండి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్. శ్రీదేవి నిర్వ‌హించారు.
ఈ సందర్భంగా డాక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి మాట్లాడుతూ, “విజ్ఞానాన్ని పంచుకోవడం, శిక్ష‌ణ అందించ‌డానికి ఒక వేదికను ఏర్పాటు చేయడానికి కిమ్స్ ఆస్పత్రి సిదంగా ఉన్నాం. రోజువారీ చికిత్స‌లు చేయ‌డంతో పాటు.. శిక్ష‌ణ అవ‌కాశాలు క‌ల్పించ‌డానికీ మేం ఎప్పుడూ కట్టుబడి ఉన్నాం. తీవ్రమైన, దీర్ఘకాలిక నొప్పి నివార‌ణ చికిత్స వ‌ల్ల నొప్పి త‌గ్గుతుంది, ఫ‌లితంగా పనితీరు మెరుగుప‌డి, జీవ‌న నాణ్య‌త పెరుగుతుంది. సాధార‌ణ చికిత్స విఫలమైనప్పుడు, శస్త్రచికిత్స చేయించుకోవ‌డం కుదరనప్పుడు అవి ఉపయోగపడతాయి. ఫ్లూరోస్కొపీ, అల్ట్రాసౌండ్ తో రియల్ టైమ్ ఇమేజింగ్ చికిత్స‌లో భద్రత, సమర్థతను పెంచుతుంది” అని వివ‌రించారు. రెండు రోజుల పాటు కిమ్స్ ఆస్పత్రిలో వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని, మూడో రోజు ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో కెడవర్ మీద శిక్షణ చేస్తారని వెల్లడించారు.
“ఈ వర్క్ షాప్ అనస్థీషియాలజిస్టులు, పెయిన్ ఫిజిషియ‌న్ల విద్యా అవసరాలను తీర్చడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. నరాలను గుర్తించడంలో రియల్ టైమ్ ఇమేజింగ్ ను అల్ట్రాసౌండ్ అందిస్తుంది. తీవ్ర‌మైన గాయాలైన‌ప్పుడు నొప్పినివార‌ణ పద్దతులు అందించ‌డానికి, పెరిఆప‌రేటివ్ ఎన‌ల్జీసియాకు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. హైరిస్క్ ఉన్న పేషెంట్ల‌లో జ‌న‌ర‌ల్ ఎన‌స్థీషియాకు ఇది మంచి ప్ర‌త్యామ్నాయం. వెన్నునొప్పి, న్యూరోప‌తిక్ నొప్పి, కేన్స‌ర్ నొప్పి లాంటి దీర్ఘ‌కాల స‌మ‌స్య‌లు సంప్ర‌దాయ వైద్యంతో త‌గ్గ‌వు. వాటిని పెర్క్యుటేనియస్ చికిత్స‌ల‌తో సమర్థవంతంగా న‌యం చేయొచ్చు. ఫ్లూరోస్కొపీ, అల్ట్రాసౌండ్ ఉపయోగించడం వల్ల భద్రత పెరుగుతుంది. ఈ వర్క్ షాప్ తీవ్రమైన, దీర్ఘకాలిక నొప్పి చికిత్స‌ల‌తో గురించి కెడావర్, వాలంటీర్ల రియ‌ల్‌-టైం ఇమేజింగ్ ద్వారా అవ‌స‌ర‌మైన సెష‌న్లతో త‌గిన అనుభ‌వాన్ని అందిస్తుంది” అని ఆమె అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *