ఆర్యవైశ్యుల సేవా దృక్పధమును విశ్వవ్యాప్తం చేయడానికి వాసవి క్లబ్స్ ను స్థాపించి బీద వారికి చేయూతనిస్తూ, ధనికులకు స్ఫూర్తి కలిగించి సేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేలా ముందుండి మార్గనిర్దేశ్యం చేసిన మహోన్నత మూర్తి స్వర్గీయ కల్వకుంట్ల చంద్రసేన గుప్తా అని వాసవి క్లబ్, ఒంగోలు అధ్యక్షులు నల్లమల్లి బదిరి నారాయణ పేర్కొన్నారు శుక్రవారం కల్వకుంట్ల చంద్రసేన గుప్త 23వ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక వీఐపీ రోడ్డు లోని విశ్వసేవిక వృద్ధాశ్రమానికి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బదరీ నారాయణ మాట్లాడుతూ కేసి గుప్తా చూపిన మార్గంలో వాసవి క్లబ్స్ సభ్యులుగా మేమంతా సమాజానికి ఇతోదికంగా సేవలు అందిస్తున్నామని, ప్రతి సందర్భాన్ని సేవగా మలుచుకొని ముందుకు సాగుతున్నామని తెలిపారు.
కార్యక్రమంలో వాసవి క్లబ్ 205 జిల్లా అధికారులు పబ్బిశెట్టి వినోద్ కుమార్, దర్శి మనోహర్ చంద్రశేఖర్, పబ్బిశెట్టి గోవర్ధన్, చీదెళ్ళ వెంకట ప్రసాద్, నేరెళ్ల శ్రీనివాసరావు, భూమా శ్రీనివాసరావు, సుంకు రఘు తదితర సభ్యులు పాల్గొన్నారు.

