ప్రజలకు పారదర్శకంగా ఉచిత ఇసుక ను సరఫరా చేయడమే ప్రభుత్వం లక్ష్యము

ఉచిత ఇసుక విధానం అమలు పై శుక్రవారం రాత్రి అమరావతి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ముకేష్ కుమార్ మీన, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్ పి లతో వర్చువల్ విధానంలో సమీక్షించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ముకేష్ కుమార్ మీన, మాట్లాడుతూ.. ప్రజలకు పారదర్శకంగా ఉచిత ఇసుక ను సరఫరా చేయడమే ప్రభుత్వం లక్ష్యమని, ఉచిత ఇసుక సరఫరా విధానంపై ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు ప్రకారం ప్రజలకు పారదర్శకంగా ఉచిత ఇసుక సరఫరా జరిగేలా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పి లు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఈ వర్చువల్ సమావేశంలో ఒంగోలు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, ఒంగోలు ఆర్డిఓ లక్ష్మి ప్రసన్న, మైన్స్ డిడి రాజశేఖర్, డిపిఒ వెంకట నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *