సస్పేషన్ గురైన వ్యక్తికే ఒంగోలు మున్సిపల్ లైటింగ్ సూపరిండెంట్ (ఎల్.ఎల్) నియామకం- ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల ఆదేశాల సైతం బేఖాతర్ – తిరిగి నియమిస్తూ ఉత్తర్వులు -ఆందోళనలో బాధితులు

సరైన అర్హత లేక తీవ్ర ఆరోపణలు ఎదుర్కోన్న మున్సిపల్ లైటింగ్ సూపరేండెంట్ (ఎల్.ఎల్-1) ను తిరిగి నియమిస్తూ ఒంగోలు మున్సిపల్ కార్పోరేషన్ ఉత్తర్వులు జారీ చేయటం విమర్శలకు తావు ఇస్తుంది. గతంలో మున్సిపల్ కమీషనర్ గా అనురాధ ఉన్న సమయంలో ఎల్. ఎల్-1 గా ఉన్న కుంచాల వెంకటేశ్వర్లును అనర్హతతో పాటు మహిళలపై లైంగిక వేధింపులతో పాటు పలు ఆరోపణలపై విధుల నుంచి తొలగించారు. అయితే మరలా మున్సిపల్ కార్యాలయంలో చక్రం తిప్పిన వెంకటేశ్వర్లు మరలా ఎల్. ఎస్ గా నియమితులౌతున్నారన్న వార్తలతో బాధితులు స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ను కలిసి అతనిపై ఉన్న ఆరోపణలు, వేధింపులపై మొర పెట్టుకున్నారు. దీంతో ఆయనను విధులలోనికి తీసుకోవద్దని ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సైతం అధికారులను ఆదేశించారు. అయితే వెంకటేశ్వర్లు ధన బలం ముందు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ అధికారం చిన్న బోయినది. దీంతో ఆయనను తిరిగి విధులలోనికి తీసుకుంటూ ఎల్. ఎస్-1 గా నియమించటంతో పాటు ఒంగోలు పట్టణంలో 1 నుండి 25 డివిజన్లు లైటింగ్, పార్క్ ల లో లైటింగ్ అప్పగిస్తూ ఈనెల 19న మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వర రావు ఉత్తర్వులు జారీ చేసారు. దీంతో గతంలో ఎల్. ఎస్ బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

నియామక ఉత్తర్వ్యు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *