రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు చీమకుర్తిలోని విద్యానికేతన్ హైస్కూల్ విద్యార్థిని ఎంపిక అయ్యారని స్కూల్ కరస్పాండెంట్ పి. రవీంద్ర బాబు తెలిపారు. విద్యార్థిని సోమవారం పాఠశాల ఆవరణలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ..
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి హాకీ పోటీల్లో అండర్ 17 బాలికల విభాగంలో ఎ.లత గోల్ కీపర్ గా ఉమ్మడి ప్రకాశం జిల్లా హాకీ టీమ్ కు సెలక్ట్ అయ్యారని చెప్పారు.నవంబర్ 3 తేదీ నుండి నుంచి 5 వరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో పాల్గొనడం జరుగుతుందని వ్యాయామ ఉపాధ్యాయులు కోటేశ్వరావు, వెంకట్ తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు కే.శ్రీనివాసరావు,
కే.ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
