ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పనితీరుపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అలాగే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్స్పెక్టర్ వి రామచందర్ తెలియజేశారు.
హైదరాబాద్ కమీషనర్ సి.వి. ఆనంద్ మరియు ట్రాఫిక్ అడిషనల్ సి.పి . విశ్వ ప్రసాద్ ల ఆదేశాల మేరకు మంగళవారం బేగంపేట టిటిఐ ఇన్స్పెక్టర్ శ్రీ. వి .రాంచందర్ ఉద్భవ్ మరియు మమత హై స్కూల్, విద్యార్థులకు బేగంపేట హీరో పార్క్ లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పని తీరు మరియు ట్రాఫిక్ పోలీస్ ల విధులు . ట్రాఫిక్ నిబంధనల గురించి తెలియజేశారు
. ట్రాఫిక్ పోలీసులు ఉపయోగించే బేరికేడ్స్,టాబ్స్, రిఫ్లెక్షన్ జాకెట్స్, మాన్పాక్క్ సెట్ మొదలగువాటిని గురించి విద్యార్థులకు వివరించారు. ట్రాఫిక్ పోలీసులు రోడ్ పైన ఏవిదంగా ట్రాఫిక్ నీ నియంత్రణ చేస్తారు అనే విషయాన్ని తెలియజేసారు. విద్యార్థులకు ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి వివరించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ రామచందర్ మాట్లాడుతూ మైనర్లు (18 సంవత్సరాలలోపు పిల్లలు) వాహనాలు నడపరాదని ,ఆది చట్టరీత్య నేరమని అన్నారు. విద్యార్థులకు చిన్నతనం నుండే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలనీ అన్నారు. అంతె కాకుండా రోడ్డుభద్రత, నియమాల గురించి వారియొక్క బోధనాంశాలలో కూడా చేర్చాలనీ అన్నారు. రహదారులపై క్రమశిక్షణగా వ్యవహారించాలి అన్నారు. విద్యార్థులు రోడ్డు దాటే సమయంలో తీసుకొనవలసిన జాగ్రత్తల గురించి తెలియజేసారు.
ఈ కార్యక్రమములో సుమారు 200 మంది విద్యార్థులు, హెడ్ మిస్ట్రెస్ వారి సిబ్బంది మరియు బేగంపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాపయ్య , వారి సిబ్బంది, టిటిఐ హెచ్ జి శ్రీ కృష్ణ మరియు హీరో మోటోకార్ప్ ప్రైవేట్ లిమిటెడ్ సూపర్వైజర్ శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.

