పోలీస్ సంస్మరణ వారోత్సవాలలో భాగంగా గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు మంగళవారం ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఇందులో భాగముగా స్కూల్ పిల్లలకు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది వాడే పరికరాల గురించి మరియు సిగ్నల్స్ గురించి, రోడ్డు దాటేటప్పుడు పాటించవలసిన నియమాల గురించి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. అలాగే పిల్లలు కూడా చిన్నతనం నుండి ట్రాఫిక్ నియమాల గురించి అవగాహన కలిగి ప్రాణాలను కాపాడుకుంటారని వివరముగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసిపి జి శంకర్ రాజు మరియు ఎస్సై జి. సతీష్ రెడ్డి , ప్రశాంత్ రెడ్డి ఏఎస్ఐ జాన్ బాబు లు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు సూచనలు ఇచ్చారు.

