ఆరోగ్య పరిరక్షణలో పురోగతి ఉన్నప్పటికీ, బాగా చదువుకున్న వారు మరియు సంపన్న వర్గాల్లో కూడా గుండె సంబంధ సంఘటనలతో పోలిస్తే బ్రెయిన్ స్ట్రోక్ గురించి అవగాహన పరిమితం గానే ఉంది. చాలామంది రోగులు స్ట్రోక్ లక్షణాలను పట్టించుకోకపోవడం, విస్మరించడం కారణంగా చాలా ఆలస్యంగా ఆసుపత్రులకు చేరుకుంటున్నారు.
వరల్డ్ స్ట్రోక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ బేగంపేటలో స్ట్రోక్ లక్షణాలను గుర్తించడం మరియు సకాలంలో వైద్య సేవలు ఎలా తీసుకోవాలనే ప్రాముఖ్యతను తెలియజేస్తూ మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హాస్పిటల్ సీనియర్ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ సిహెచ్ గోపాల్, డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ నివేదిత సాయి చంద్ర ల ఆధ్వర్యంలో స్ట్రోక్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా గుర్తించాలి, ఎంత త్వరగా వైద్య సేవలు అందించాలనే విషయాలపై అవగాహన కల్పించడంతోపాటు స్ట్రోక్ తో బాధపడుతూ చికిత్స అనంతరం కోలుకున్న పేషంట్ కు అందించిన చికిత్సలను ఈ సందర్భంగా తెలియజేశారు.
నిర్ధారణ కంటే నివారణ చాలా ముఖ్యమని ఈ సందర్భంగా వైద్యులు తెలిపారు. రోజువారి వ్యాయామం, జీవనశైలిలో మార్పుల ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని ఈ సందర్భంగా తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలను గుర్తిస్తే బి ఫాస్ట్ (BE FAST) అమలు చేయాలని సూచించారు. B - బ్యాలెన్స్ తప్పడం, E- ఆకస్మిక దృష్టిలోపం, F- ముఖం ఒక వైపు వంగిపోవడం, A- చేతులు బలహీన పడడం, S- మాట్లాడడంలో ఇబ్బంది, T- వెంటనే స్పందించడం.
స్ట్రోక్ చికిత్సలో ప్రతి నిమిషం చాలా ముఖ్యమైనది, ప్రతి నిమిషానికి మెదడులో మిలియన్ల కొద్ది నరాలు దెబ్బ తినడం, జ్ఞాపక శక్తిని, పనితీరు శాశ్వతంగా కోల్పోయేలా చేస్తుంది. సరైన చికిత్స కోసం 24/7 అత్యవసర సేవలు, ఏం ఆర్ ఐ / సి టి స్కాన్, ఐసీయూ సేవలతోపాటు న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్, సపోర్ట్ సిబ్బంది సిద్ధంగా ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లాలి. యాంజియోగ్రఫీ, క్లాత్ రిటైవల్ తో సహా ఆధునిక చికిత్సల ఎంపికలు కలిగిన క్యాత్ ల్యాబ్, న్యూరో ఇంటర్వెన్షనల్ నైపుణ్యంతో కూడిన ప్రత్యేక స్ట్రోక్ సెంటర్ అందుబాటులో ఉండాలని తెలిపారు. స్ట్రోక్ ను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే గోల్డెన్ అవర్ లో రోగిని హాస్పిటల్కు తీసుకురావాలని తెలిపారు.