ప్రతి ఒక్కరూ క్యాన్సర్ పై అవగాహన కలిగి ప్రజలను అప్రమత్తం చెయ్యాలని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడు కొండల రావు అన్నారు. మెడికల్ కళాశాలలో మంగళవారం ప్రీవెంటివ్ అంకాలజీ యూనిట్, ప్రభుత్వ వైద్య కళాశాల, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా డాక్టర్లు, ఎం.ఎల్.హెచ్.పి, ఆ రోగ్య కార్యకర్తలకు క్యాన్సర్, డయా బెటిస్, రక్త పోటు గురించి అవగాహన కల్పించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఆహార నియమాలు సక్రమంగా పాటించక పోక పోవటం, పొగ త్రాగటం, వ్యాయామం చేయక పోవటం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పారు. సూపరిండెంట్ దుర్గా దేవి మాట్లాడుతూ పుట్టిన పిల్లలకు తల్లిపాలు ఇవ్వటం వలన రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుందని చెప్పారు. నోటి క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ గురించి నిర్ధారణ పరీక్షల గురించి వివరించారు. అంకాలజీ నోడల్ ఆఫీసర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ బి. తిరుమల రావు, డిప్యూటీ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ నామినేని కిరణ్, ఎన్. సి.డి పొగ్రాం ఆఫీసర్ డాక్టర్ భగీరథ్, ఆర్ ఎంఓ డాక్టర్ మాధవీలత, డాక్టర్ శ్రీనివాస రెడ్డి, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ సంధ్యా రాణి, డాక్టర్ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

