జాతీయ రహదారి 167(బీ) నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియలో ధర నిర్ణయం కోసం జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణ మంగళవారం అవార్డు ఎంక్వయిరీ చేశారు. ఈ రహదారి నిర్మాణం కోసం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు ఆయన కాంపిటీటివ్ అధారిటీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కందుకూరు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. కందుకూరుతో పాటు వీ.వీ.పాలెం మండలంలోని నేకునాంపురం, పోకూరు గ్రామాల్లో ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వెంట కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీపూజ, ఆయా మండలాల తహశీల్దార్లు, ఇతర అధికారులు ఉన్నారు.

