నవంబరు 9న శ్రవణా నక్షత్ర శ్రీ గిరి గిరి ప్రదక్షిణ.”శ్రీ పార్వతీ వల్లభాష్టకం” పఠన పోటీలు

పరమ పవిత్రమైన కార్తీక మాసం, శ్రవణా నక్షత్రం రోజున కోటి సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ గిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి మాసంలో జరిగే శ్రవణా నక్షత్ర శ్రీగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమం నవంబర్ 9వ తేదీ, శనివారం ఉదయం 5 గంటలకు శ్రీ గిరి పాదపీఠం వద్ద గల శ్రీ బాపూజీ గోసంరక్షణ సంఘం (గోశాల) వద్ద నుండి వందలాదిగా విచ్చేసిన భక్తులు సామూహికముగా గోవింద నామాలు చదువుకుంటూ శ్రీగిరి గిరిప్రదక్షిణను ప్రారంభిస్తారని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటి అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం ఒక ప్రకటనలో తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ప్రతిమాసంలో నిర్వహిస్తున్నట్లే ఈ కార్తీకమాసంలో శంకరిచార్య విరచిత “శ్రీ పార్వతీ వల్లభాష్టకం” (నీల కంఠ స్తవము) పఠన పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఔత్సాహికులు, హిందూ ధర్మం, సనాతన సంప్రదాయాలపట్ల భక్తి, గౌరవం కలవారు, వయసుతో సంబంధం లేకుండా చిన్నారులు, పెద్దవారు, ఎవరైనా ఈ పఠన పోటీలో పాల్గొనవచ్చునని, శ్రీ పార్వతీ వల్లభాష్టకమును చూడకుండా పఠించి, వీడియో తీసి పోటీలకు పంపవలయునని, వీడియోలను 94 92 180 492 నంబరుకు అడ్డముగా తీసి నవంబరు 7వ తేదీ లోపల పంపవలయునని వివరించారు. విజేతలకు నవంబరు 9వ తేది ఉదయం శ్రవణా నక్షత్ర గిరిప్రదక్షిణ పూర్తి అయిన తరువాత శ్రీగిరి ప్రాంగణమున బహుమతి ప్రదానం చేయడం జరుగునని తెలిపారు. ఒంగోలు, పరిసర ప్రాంత ప్రజలు శ్రీగిరి గిరిప్రదక్షిణ లో పాల్గొని శ్రీవారిని దర్శించి కృతార్ధులు కాగలరని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *