మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని కళాసి కూడా హైస్కూల్ సమీపంలో ఈనెల 30వ తేదీన గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమయింది. మహిళ గురించి స్థానికంగా పోలీసులు ఆరా తీయగా ఆమె ఎవరో తమకు తెలియదని, వారి నుంచి సమాచారం వచ్చింది. ఈ సంఘటనపై మహంకాళి పోలీసులు కేసు నమోదు చేశారు.మృతి చెందిన మహిళ వయస్సు సుమారు(30) సంవత్సరాలు ఉంటుందని, ఎత్తు ఐదు అడుగులు, బ్లూ కలర్ టాప్,గ్రే కలర్ ప్యాంట్ ధరించి ఉందన్నారు. హిందువుగా అనిపిస్తుందని, మృతదేహాన్ని చూస్తే బెగ్గర్ గా కనిపిస్తుందని,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మహిళ ఆచూకీ తెలిసినవారు మహంకాళి పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని ఏఎస్ఐ చలపతి తెలియజేశారు.
