సికింద్రాబాద్..మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధి అర్ పి రోడ్డు లోని ఓ గోదాం లో అగ్నిప్రమాదం సంభవించింది.దీపావళి పండుగ నేపథ్యంలో బాణాసంచా కాలుస్తున్న క్రమంలో నిప్పు రవ్వలు రెండవ అంతస్తు లోని గోదాం లో పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.అక్కడ ఎలక్ట్రికల్ సామాన్ల తో పాటు ఖాళీ అట్ట పెట్టేలను నిల్వ చేశారు. దీంతో క్రాకర్స్ నిప్పురవ్వలు పడి కాలిపోయాయి.రమేష్ ఎలక్ట్రికల్స్ కు చెందిన గోదాం నుంచి మంటలు రావడంతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు.వారు వెంటనే డయల్ 100కు సమాచారం ఇచ్చారు .వెంటనే అక్కడకు చేరుకున్న మహంకాళీ ఇన్స్పెక్టర్ పరుశురాం
సమాచారం మేరకు అగ్ని మాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో అక్కడకు చేరుకునీ మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.రమేష్ ఎలక్ట్రికల్స్ గోదాం పరిసర ప్రాంతాలలో నివాసాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది..అగ్ని ప్రమాదంలో గోదాం లోని ఎలక్ట్రిక్ వస్తువులు , ఖాళీ అట్ట పెట్టెలు అగ్నికి ఆహుతవగా కొంతమేర ఆస్తి నష్టం జరిగింది.ఎలాంటి ప్రాణ నష్టం జరగక పోవడం తో అంతా వూపిరి పీల్చుకున్నారు..
