తాళ్లూరు మండలంలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో అపార్ (ఆటోమెటిక్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ), ఎస్ఏ-1 మార్కుల నమోదు వివరాలను శుక్రవారం ఎంఈఓ-2 సుధాకర్ రావు పరిశీలించారు. తాళ్లూరులో సరస్వతి హైస్కూల్, ఎబీసీ హైస్కూల్ లను ఎంఈఓ-2 సుధాకర్ రావు అకస్మికంగా సందర్శించి ఆపార్, ఎస్ఏ-1 మార్కుల నమోదుపై పరిశీలించారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రర్థ తీసుకుని నమోదు మరింత వేగవంతం చెయ్యాలని కోరారు. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నమోదుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మండల విద్యాశాఖాధికారి జి. సుబ్బయ్య కోరారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీరామ మూర్తి, కె. వెంకటేశ్వర రావులు పాల్గొన్నారు.

