చిన్నారులకు ఎంతో ఇష్టమైన దీపావళి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. చిన్నారులు తమకు ఇష్టమైన బాణ సంచా కాలుస్తూ సంతోషంగా గడుపగా, పెద్దలు భక్తి శ్రర్థలతో దేవాలయాలలో, నివాసాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్సై మల్లిఖార్జున రావు అనుమతి ఉన్న దుకాణాలలో మాత్రమే బాణ సంచా అమ్మెందుకు అనుమతించి ఆదిశగా చర్యలు చేపట్టారు.



