మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో దీపావళి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రజలు అందరికీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా గురువారం రాత్రి జూబ్లీహిల్స్ లోని తన నివాసం వద్ద కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్, మనువడు తారక్ లతో కలిసి బాణసంచా కాల్చి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ ఈ దీపావళి నియోజక వర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరి జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.




