మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ థ్యేయం – టిడిపి దర్శి నియోజకవర్గ ఇన్ ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

గుంతలమయమైన రహదారులకు మరమ్మతులకు మన కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టి చక్కటి ప్రయాణానికి బాటలు వేస్తుందని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ఆర్అండ్ బి రహదారుల మరమ్మతుల కార్యక్రమంలో భాగంగా శనివారం దర్శి పట్టణంలోని గడియార స్తంభం నుంచి అద్దంకి వెళ్లే రహదారులకు మరమ్మతుల కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి……మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో రోడ్లను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.. లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి సంక్షేమం పేరుతో దోచుకొని రాష్ట్రాన్ని దివాలా తీయించారని విమర్శించారు. రోడ్లన్నీ గుంతల మయమైనా తట్ట మట్టి కూడా పోసిన పరిస్థితులు లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపిస్తున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్అండ్ బి రహదారులలో గుంతలు పూడ్చే కార్యక్రమానికి దాదాపు రూ.800 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. మన దర్శి ప్రాంతంలో కూడా ప్రధాన రహదారుల్లో గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రజల అవసరాలు తీర్చడమే మన ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కడియాల లలిత్ సాగర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, కలువకొలను చంద్రశేఖర్, ఆర్అండ్ బి ఇఇ సమర్పణరావు, డి.ఈ గోపికృష్ణ, జె.ఈ రఫీ, నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యన కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *