జాతీయ ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

జాతీయ ఉపకార వేతనాలకు దరఖాస్తుల గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15 వరకు పొడిగించింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 30తో గడువు ముగియగా మరో 15 రోజులు పొడిగించింది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీ టీఈ), విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) ద్వారా ఈ పథకాలను అమలు చేస్తోంది. ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్షిప్ కు టెక్ని కల్ డిగ్రీ, డిప్లొమా మొదటి ఏడాది బాలికలుఅర్హులు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

వీరికి ఏడాదికి రూ.50 వేల చొప్పున ఉప కార వేతనం లభిస్తుంది. ఏఐసీటీఈ సాక్షమ్ టెక్ని కల్ డిగ్రీ, డిప్లొమాలో ఏ సంవత్సరంలోనైనా దివ్యాంగులకు ఏడాదికి రూ.50 వేలు అందుతుంది. ఏఐసీటీఈ స్వాంతన్ కింద తల్లిదండ్రులు చనిపో యిన అనాథలకు ఏ సంవత్సరంలోనైనా రూ.50 వేలు లభిస్తుంది. యూజీసీ పోస్టుగ్రాడ్యుయేట్స్ కు మొదటి ఏడాది చదువుతున్నవారు అర్హులు. వీరు ఉపకార వేతనానికి ఎంపికైతే నెలకు రూ.10 వేల చొప్పున 15 నెలలు చెల్లిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *