కార్తీక మాసం మొదటి సోమవారం శ్రీశైలం భ్రమరాంభా మల్లిఖార్జున స్వామి… ఆ
పార్వతి – పరమేశ్వర్లు లను దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ – డాక్టర్ కడియాల లలిత్ సాగర్ .. కుమారులు అక్షయ్ నంద,అభయ్ వర్ధన్, మరియు గొట్టిపాటి పద్మ కుటుంబ సభ్యులు దర్శించు కున్నారు . ఈ సందర్బంగా గా దర్శి నియోజకవర్గ ప్రజలకు కార్తీక మాసం శుభాకాంక్షలు తెలియజేసారు.
దర్శి ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందాలని .. మన కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం సర్వోతో ముఖాభివృద్ధి సాధించి అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది ప్రజలకు అన్ని రంగాలలో మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామిని వేడుకున్నామని తెలిపారు .

