పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పరిధిలో పోలీస్ సిబ్బందికి, వివిధ కళాశాలు, పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలగా నిలిచిన వారికి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నగదు బహుమతులను అందచేసినారు.
ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీఏఆర్ దామోదర్ మాట్లాడుతూ…. పోలీసు అమరవీరులకు నివాళిగా, వారి త్యాగాలను యువతకు పరిచయం చేయడం కోసం చేపడుతున్న ప్రేరణాత్మక కార్యక్రమాల్లో వ్యాసరచన పోటీలు ఒకటి అన్నారు. ఈ వ్యాసరచన పోటీలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించామని, పోలీసు సిబ్బంది మరియు విద్యార్థులు ఈ వ్యాసరచన పోటీలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని అద్భుతంగా రాసారని విజేతలను అభినందించారు. విద్యార్థులు మంచి అలవాట్లను పాటిస్తూ చక్కగా చదువుకోవాలని, చదువుల్లో క్రమ శిక్షణ, హేతుబద్దత, విశ్లేషణను అలవరుచుకోవాలని విద్యార్థులు వారి కిష్టమైన రంగాల్లో నిర్ధిష్టమైన లక్ష్యాన్ని నిర్ణయించుకొవాలని, సరైన ప్రణాళిక, సమయ పాలన మరియు కఠోర కృషితో బంగారు భవిష్యత్తు వైపు బాటలు వేసుకోని మంచి గుర్తింపు పొందాలని సూచించారు. విద్యార్థులు చదువులతో పాటు మంచి క్రీడలు, చక్కటి హాబీస్ అలవర్చుకోవాలని, ఫేక్ లోన్ యాప్స్, ఓటీపీ, ఆన్లైన్/పార్ట్ టైం జాబ్ మోసాలు, ఆధార్ కార్డు అప్డేషన్ తదితర సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
పోలీస్ సిబ్బందికి ” ప్రస్తుత సమాజంలో పోలీసులు ఎదుర్కొంటున్న సవాళ్లు”, విధ్యార్థులకు “సైబర్ నేరాల నివారణలో యువత పాత్ర” అనే అంశాలపై వ్యాస రచన పోటీలను నిర్వహించారు. ప్రథమ బహుమతికి రూ. 5 వేలు, ద్వితీయ బహుమతి రూ. 3 వేలు,తృతీయ బహుమతి రూ. 2 వేలు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.
విజేతలు వీరే….
పోలీస్ సిబ్బందిలో విజేతలు:
పి.శ్రీదేవి (WHC- 246, ఒంగోలు వన్ టౌన్), కె.సత్య నారాయణ (PC.659, SWAT టీం), బి.ఎవాంజలి (WPC.593, పెద్దారవీడు పీఎస్).
లు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు.
స్కూల్/కాలేజీ విద్యార్థులలో విజేతలు:
బి.వెంకటమ్మ, (కె.జి.బి.వి.జూనియర్ కాలేజీ) ,షకీబ్ (నారాయణ జూనియర్ కాలేజీ, ఒంగోలు),డి.పావన నందన (భాష్యం హై స్కూల్, ఒంగోలు).లు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు.
పోలీస్ పిల్లలు విజేతలు
జి.సాయి నిహారిక D/o జి.పవన్ కుమార్, పిసి.701, యం.ప్రీతీ అనన్య D/o యం.లక్ష్మి నారాయణ ARPC.2725, వి.తరుణ్ S/o వి.ప్రసన్న, పిటిసి, ఒంగోలు లు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు.
కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఎఆర్ డిఎస్పీ చంద్ర శేఖర్, ఆర్ఐలు రమేష్ కృష్ణన్, రమణా రెడ్డి, సీతారామరెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.



