రీ సర్వేలో ఇబ్బందులు పడిన వారికి న్యాయం చేయటమే లక్ష్యం – ఎంపీపీ తాటికొండ

గత ప్రభుత్వంలో రీ సర్వేలో తప్పుల తడకగా విస్తీర్ణాలు పడి ఇబ్బందులు పడిన వారికి సర్వర న్యాయం చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అన్నారు. మాధవరం గ్రామంలో రీ సర్వే భూ సమస్యల పరిష్కారం నిమిత్తం గ్రామ సభను నిర్వహించారు. సర్పంచి తాటికొండ రేణుక అధ్యక్షతన సభను నిర్వహించారు. సభలో వివిధ సమస్యలపై 50 దరఖాస్తులు అందినట్లు రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ ప్రశాంత్ తెలిపారు. ఇన్చార్జి సర్వేయర్ మల్లిఖార్జున రావు, విఏస్ బాష, విఆర్ఎ వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *