ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి ఒక్కరూ ప్రొత్సహించి భూమిని రక్షించాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. అయ్యల పాలెం, నాగంబొట్ల పాలెం, తూర్పు గంగవరం గ్రామాలలో మంగళ వారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయం వలన కలిగే ప్రయోజనాలు, పొందుతున్న లాభాలను గురించి కషాయం, ఇతర ద్రావణాల తయారీ గురించి వివరించారు.
ప్రత్యామ్నాయ పంటలు సాగు చెయ్యాలి …
పొగాకు బదులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులు పయనించాలని వ్యవాసయాధికారి ప్రసాద రావు కోరారు. రైతు సేవా కేంద్రంలో మంగళవారం పొగాకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రకృతి సాగు ఇన్చార్జి పి నరసింహులు, విఏఏ వెంకట సుమ, ఐసీఆర్ఎలు కోటి, అనంతమ్మ, వాణి, కోటి రత్నం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


