కూటమి పాలనలో రాష్ట్రం రావణ కాష్టంలా రోజు రోజుకు మారుతుందని ఉమ్మడి ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వర రావు అన్నారు. ఒంగోలు వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం వైఎస్సార్సీపీ పార్టీ సమీక్షా సమావేశం జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వర రావు మాట్లాడుతూ … అందరితో కలిసి సమన్వయంతో పనిచేస్తానని.. చెప్పుడు మాటలు వినకుండా నా వంతు కృషిగా కష్టపడి పనిచేస్తానని అన్నారు. గెలిచిన కూటమి ఏ విధంగా గెలిచిందో.. దేశం కోడై కూస్తుందని అన్ని వర్గాలు మేము ఓటు వేసాము అని చెబుతున్నారని, మా నాయకుడు, మేము ఏమి తప్పిదం చేయలేదని అన్నారు. రాబోవు రోజులలో అందరం సమన్వయంతో పనిచేసి మరలా సీఎం గా వైఎస్ జగన్ ను చేసుకుంటామని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని ఎక్కడ చూసినా అరాచకం, మహిళలపై, బాలికలపై దాడులు చేస్తున్నారని.. వారికి ఇచ్చిన అధికారాన్ని ఉపయోగిస్తు అరాచకం చేస్తున్నారని ఆరోపించారు. నాడు సీఎం వైఎస్ జగన్ ఎన్నిక అయిన వెంటనే అన్ని పధకాలకు వర్గాలు, పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు ఇచ్చారు. వారికి ఇచ్చిన అధికారాన్ని ప్రజలకు మంచి చేయటానికి ఉపయోగించలేదని అన్నారు. ఇచ్చిన హామీలను ఆటకెక్కించారని అన్నారు నేడు లబ్దిదారులను పార్టీలుగా విడదీసి ఎలా చేస్తున్నారో చూస్తున్నామని వాపోయారు. పథకాలు ఇవ్వక పోయినా కక్ష్య సాధింపుకు ముందు ఉంటున్నారని అన్నారు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగాలలో మేము బయట తిరుగుతుంటే ప్రజలు తిడుతున్నారని అంటూ వాపోతుంటే… పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని వివరించారు. ఏ ఇంటికి అయినా వేళ్లి ధైర్యంగా చెప్పుకునే ధైర్యం లేదు ఈ కూటమి ప్రభుత్వానికి అని విమర్శించారు. కాని మేము గతంలో మా నాయకుడు ప్రతి ఇంటికి మేలు చేసామని ధీమా వ్యక్తం చేసారు. మేము ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్లి చేసిన మంచిని చెప్పు కున్నామని అన్నారు.
ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ….. ఐదు నెలలకే రాష్ట్రం అరాచక పాలన చూస్తున్నామని విమర్శించారు. తప్పులను ఎత్తి చూపితే వేదించటం తగదని, ఇది మంచి పద్ధతి కాదని హితవు చెప్పారు. బాలికలపై మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, ఆడ పిల్లలను స్కూల్స్ కు పంపితే అభద్రత పెరిగినదని అన్నారు. వైన్స్ షాపులు వచ్చిన తర్వాత మరింత వేధింపులు పెరిగాయని అన్నారు. గతంలో ఎక్కోడో ఒక చోట ఉండేవని, నేడు వీధి విధికి.. బెల్డ్ షాపులు ఉన్నాయని అన్నారు. కూల్ డ్రిక్స్ దొరికినట్లు మద్యం దొరుకుతున్నదని అన్నారు. గతంలో బెర్డ్ షాపులు లేని రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం…. ఒక్కసారిగా విచ్చల విడిగా బెల్ట్ షాపులు వచ్చాయని అన్నారు. పోరాటాలతో పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ అని .. ప్రతి పక్షం, పోరాటాలు కొత్త కాదని అన్నారు. ప్రతి నాయకులు, సైనికులుగా సిద్ధంగా ఉన్నారని అన్నారు. కార్యకర్తలపై, మహిళలపై దాడులు కాని, తప్పుడు కేసులు గాని ప్రజలలో తిరుగుబాటు రావటానికి అవకాశంగా పరిపాలన ఉన్నదని అన్నారు. వైఎస్ జగనన్న సైనికులుగా పోరాటం చేస్తామని అన్నారు.జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… సీఎంగా మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేసుకునేందుకు ప్రతి కార్యకర్తలతో కలసి కృషి చేస్తామని అన్నారు. ఎన్నో పోరాటాలు చేసిన కారుమూరి నాగేశ్వర రావును రీజనల్ కోఆర్డినేటర్ ఇవ్వటం ఎంతో సంతోషమని చెప్పారు. రాబోవు ఎన్నికలలో ప్రకాశం జిల్లాలో 8 సీట్లకు 8 సీట్లు కైవసం చేసుకునేందుకు తగిన కృషి చేస్తామని అన్నారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియాను ఎంతో ఇబ్బందులు పెడుతున్నారు. వారికి మేము అండగా ఉంటామని అన్నారు. ముందుగా రీజనల్ కోఆర్డినేటర్కు వైఎస్సార్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. దివంగత సీఎంకు ఘన నివాళులు అర్పించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సర్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండ పాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్, ఎమ్మెల్సీ మాధవ రావు, నియోజక వర్గ ఇన్చార్జిలు నాగార్జున రెడ్డి, అన్నా రాంబాబు, బుర్రా మధుసూధన్ యాదవ్ , దద్దాల నారాయణ పాలెం హనిమి రెడ్డి, అధికార ప్రతినిధి బ్రహ్మనందరెడ్డి , ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టి జె ఆర్ సుధాకర్ బాబు, మాదాసు వెంకయ్య, కాకుమాను రాజశేఖర్, కనకారావు తదితరులు పాల్గొన్నారు.






