మొక్కజొన్న కోతలో, ఆరబోతలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారి ప్రసాదరావు కోరారు. మాధవరం, శివరాంపురం గ్రామాలలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. మొక్కజొన్న ప్రస్తుతం మార్కెట్లో రూ. 2200 నుంచి రూ.2300 వరకు ఉన్నదని మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడులు మరింతగా వస్తాయని చెప్పారు.
రైతులు సూక్ష్మ పోషకాలు అయిన జింక్, జిప్సం బోరాన్ సబ్సిడీపై ఇవ్వాలని కోరారు. విఏఏలు సుధీర్, నాగరాజులు పాల్గొన్నారు.
