నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చే బాధ్యత చదువుకున్న వారందరిపై వుందని మండల విద్యాశాఖాధికారి జి.సుబ్బయ్య అన్నారు. స్థానిక వెలుగు కార్యాలయంలో వయోజన విద్యాశాఖ, డిఆర్డీఏ ద్వారా ఉల్లాస్ అనే కార్యక్రమంపై వాలంటీర్లకు ఒక రోజు శిక్షణా కార్యక్రమం బుధవారం జరిగింది. ఈసందర్బంగా ఎంఈవో జి సుబ్బయ్య మాట్లాడుతూ… విద్యప్రాధాన్యత అవశ్యకత గురించి మహిళలకు ఎంతైనా వుందని తెలిపారు. ఎంపీడీవో కె.సుందరరామ య్య మాట్లాడుతూ …పొదుపు గ్రూపు మహిళల్లో అనేకమంది సంతకం మాత్రమే. నేర్చుకున్నారని, చదవటం రాక పోవటం వల్ల సమస్యలు వస్తున్నాయని, ప్రతి ఒ క్కరూ చదువు నేర్చుకుని సంతకం పెట్టే విధంగాతీర్చి దిద్దాలన్నారు. వెలుగు ఏపిఎం దేవరాజ్ మాట్లాడుతూ …మొదటి విడతగా నిరక్షరాస్యులైన 660 మందికి చదువు నేర్పించేకార్యక్రమం చేపట్టామని చెప్పారు. మండలంలోని బెల్లంకొండవారిపాలెం,తూర్పుగంగవరం, నాగంబొట్లపాలెం, రామభద్రాపురం, మల్కాపురం గ్రామాల్లో ఉ ల్లాస్ కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందన్నారు. వీరికి చదువు నేర్పేందుకు 66మంది వాలంటీర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. నవంబర్ 6నుండి వ చ్చే ఏడాది మార్చి 15వరకు వాలంటీర్లు వయోజనులకు శిక్షణా తరగతులు నిర్వహించాలన్నారు. వాలంటీర్లకు ఏవిధమైన పారితోషకం ఉండదని పూర్తిగా ఉచితంగా విద్యనేర్పాలన్నారు.ఈ కార్యక్రమంలో వయోజనవిద్య సూపర్వైజర్ ఎన్ వెంకటరెడ్డి, అంగనవాడీ సూపర్ వైజర్ జ్యోతి , వెలుగు సీసీలు మోహన్, సుచీంద్ర, వాలంటీర్లు, వివోఏలు తదితరులు పాల్గొన్నారు.


