మహిళా సాధికారతకు స్వయం సహాయక సంఘాలు ఇతోధికంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పేర్కొన్నారు.
బుధవారం ఉదయం కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ హల్లో జరిగిన స్వయం సహాయక సంఘాల ప్రొఫైలింగ్ యాప్ నిర్వహణ పై నిర్వహించిన జిల్లా స్థాయి వర్క్ షాప్ లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ….. మహిళా సాధికారతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పధకాలను స్వయం సహాయక సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకొని ఆర్ధిక స్వావలంభన దిశగా అడుగులు వేయాలన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పధకాలను సద్వినియోగం చేసుకొని మహిళా పారిశ్రామిక వేత్తలుగా ఎదగడంతో పాటు మహిళా సాధికారతకు కృషి చేయాలన్నారు. ప్రతి బాలిక ఖచ్చితంగా చదువికొనేలా స్వయం సహాయక సంఘాల సభ్యులు కృషి చేయడంతో పాటు సామాజిక మార్పుకు కృషి చేయాలన్నారు. జిల్లాలో బంగారు బాల్యం కార్యక్రమం ద్వారా 0 నుండి 18 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు ముఖ్యంగా బాలికలపై దృష్టి సారిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుచున్నవని, బాల్య వివాహాలను అరికట్టుటకు క్యాంపెయిన్ చేయబోతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి స్వయం సహాయక సంఘలా సభ్యులు భాగస్వాములు కావాల్సిన అవసరం వుందన్నారు. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త యాప్ ను తీసుకొని రావడం జరుగుచున్నదని, ఈ యాప్ లో స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్ధిక పరమైన, సామాజిక పరమైన సమగ్ర డేటా ను నమోదు చేయడం జరుగుతుందని, ఈ యాప్ నిర్వహణ పై ఈ రోజు ఇస్తున్న శిక్షణా కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి స్వయం సహాయక సంఘం సభ్యులు క్షుణ్ణంగా అర్ధం చేసుకొని సమగ్ర డేటా నమోదుకూ కృషిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ యాప్ జనవరి మాసానికి అందుబాటులో రానున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెప్మా పిడి రవి కుమార్, ఏ.ఓ వినీల్, టెక్నికల్ సిబ్బంది ఫణి కుమారి, సంతోష్ కుమార్, జయకుమార్, కల్పన, స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



